![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -585 లో.. దీప, కార్తీక్ ల దగ్గరికి దశరథ్ వచ్చి మాట్లాడుతాడు. నీ బిడ్డ.. నా చెల్లి సంతోషం తనని జాగ్రత్తగా కాపాడమని దశరథ్ చెప్తుంటే కార్తీక్ కి ఏడుపు ఆగదు. దశరథ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్న అలా విడాకులు ఇస్తానంటే మీరేం అనట్లేదని కాంచన అంటుంది. స్వప్న మొండిది అని కావేరి అంటుంది. అయితే మాత్రం అలా విడాకులు ఇస్తానని అంటుందా కావేరి.. వెళ్లి స్వప్నని తీసుకొని రా అని కాంచన చెప్తుంది.
స్వప్న వచ్చి పెద్దమ్మ పిలిచారట అని అంటుంది. నువ్వు కాశీ దగ్గర కావాలని కాంచన అనగానే అది ఎప్పటికి జరగదు పెద్దమ్మ.. కాశీ విశ్వాసం లేని కుక్క అని కాశీని అవమానిస్తుంది స్వప్న. దాంతో కాశీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు జ్యోత్స్న కోపంగా ఇంటికి వస్తుంది. నీకు నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్న విషయం తెలుసు కదా మరి ఎందుకు చెప్పలేదని జ్యోత్స్న అనగానే నాకు అక్కడ ఛాన్స్ ఎక్కడ ఉందని పారిజాతం అంటుంది. కనీసం మెసేజ్ అయినా చెయ్యాలి కదా అని జ్యోత్స్న అనగానే అయ్యో అవును కదా మర్చిపోయానని పారిజాతం అంటుంది.
ఇప్పుడు రిపోర్ట్స్ లో మళ్ళీ మ్యాచ్ కాలేదని తెలిస్తే నేనేం చెయ్యాలని ఆలోచిస్తుంటే.. నువ్వు ఒకదానివి అని జ్యోత్స్న అంటుంది. నీకు దాస్ గురించి తెలుసా అని పారిజాతం మరి మరి అడుగుతుంది. లేదని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు తల్లిని కాపాడుకోవాలా బిడ్డకి జన్మని ఇవ్వాలా అని దీప ఏడుస్తుంటుంది. పుట్టబోయే బిడ్డ గురించి చాలా ఉహించుకున్నానని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |